అఖిల్ అక్కినేని, తమ కుటుంబంలోకి కొత్తగా వస్తున్న (వస్తున్న ఏంటీ, ఆంల్రెడీ వచ్చేసినట్లే.. అయితే, ఇంకా జస్ట్ ఎంగేజ్‌మెంట్ మాత్రమే అయ్యింది గనుక, పెళ్ళి ఇంకా కావాల్సి వుంది గనుక.. వస్తున్న అనడం సబబేనేమో..) న్యూ మెంబర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అన్నయ్య నాగచైతన్యతో, కాబోయే వదిన (ఆల్రెడీ అయిపోయినట్లే కదా..)తో కలిసి ఫొటోకి పోజులిచ్చిన అఖిల్, ఆ గ్రేట్ మూమెంట్స్‌ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
'మై డార్లింగ్ వదిన సమంత.. హ్యాపీ బర్త్ డే..', 'దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్..' అంటూ, చివర్లో 'లవ్ యూ' అంటూ ముక్తాయింపునిచ్చాడు అఖిల్. సమంత, నాగచైతన్య గత కొన్నాళ్ళుగా ప్రేమలో మునిగి తేలడం, ఇద్దరి పెళ్ళికీ అక్కినేని నాగార్జున ఓకే చెప్పడం తెల్సిన విషయాలే. మరోపక్క, అఖిల్ కూడా ప్రేమలో పడ్డాడు. కొన్ని కారణాలతో ఆ పెళ్ళి గందరగోళంలో పడిందనుకోండి.. అది వేరే విషయం.
ముందు అఖిల్‌కి ఎంగేజ్‌మెంట్ అయ్యింది.. ఆ తర్వాత నాగచైతన్య, సమంతలకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. కానీ, ఇప్పుడు నాగచైతన్య - సమంతల పెళ్ళి విషయంలో క్లారిటీ వుందిగానీ, అఖిల్ పెళ్ళి విషయంలో మాత్రం క్లారిటీ లేదాయె. ఆ విషయం అలా వుంచితే, మరిది తన పుట్టినరోజున చెప్పిన శుభాకాంక్షలకి సుమంత తెగ మురిసిపోతోందట.