బాబు భక్తులారా.. ఏ ప్రళయానికి ఈ పరాకాష్ట?

అధికారంలో ఉన్నప్పుడు అలజడులు సృష్టించినోళ్లను ఎంతో మందిని చూశాం కానీ.. మరీ ఇంత అతి చేసిన వాళ్లను చూస్తున్న సందర్భం మాత్రం ఇదే. ఇది వరకూ చంద్రన్న భక్తులు తమ అభిమాన నేతను  నాణ్యత లేని గ్రాఫిక్ టెక్నిక్స్ ను ఉపయోగించి దేవుడిగా చూపించ యత్నించారు. వెంకటేశ్వర స్వామి, షిర్డీ సాయి బాబా ల ఫ్లెక్సీల్లో గడ్డంతో కూడినఈ బాబుగారి మొహాన్ని అతికించి చంద్రన్నను దేవుడి గా చేసేశారు.

అదంతా ఒక ఎత్తు అయితే.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ అవుతున్న కొన్ని ఫొటోలు ఇప్పుడు హైందవ భక్త జనాన్ని భయపెట్టేస్తున్నాయి. వినాయక చవితి స్పెషల్ గా బాబుగారి భక్తగణం ఆ వినాయకుడినే భయపెట్టేస్తోంది. 

ఏకంగా బాబుగారి విగ్రహన్ని ఒకటి తయారు చేసి.. వినాయక చవితి పందిరిలో ప్రతిష్టించేశారు. ఇంత వరకూ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో కనపడని ఈ తెగింపు, పైత్యం ఆంధ్రలో ఆవిష్కారం అవుతోందిప్పుడు. అలాగే ఏపీలోని మరోచోట కొంతమంది మోడీ భక్తులూ ఆయన విగ్రహాన్ని ఒకటి చేయించి వినాయకుడితో పాటు కూర్చోబెట్టారు!

బాబుపైనో, మోడీపై నో రాజకీయ అభిమానం ఉంటే ఉండవచ్చు గాక.. మరీ ఇంతలానా! దేవుడి స్థాయినే ఇంత దిగజార్చుతున్నారే… మరి ఏ ప్రళయానికి ఈ పరాకాష్ట నో అర్థం కావడం లేదు.  Readmore!

Show comments