'కబాలి'ని ఇంకా అమ్మేస్తారట.!

'కబాలి' పేరు చెప్పి చిత్ర నిర్మాత చెయ్యాల్సినన్ని పబ్లిసిటీ స్టంట్లూ చేసేశారు. చెయ్యకూడనివీ చేసేశారు. విపరీతమైన హైప్‌ని క్రియేట్‌ చేసేసి, జనాన్ని నిండా ముంచేశారు కూడా. రజనీకాంత్‌ కెరీర్‌లో భారీ 'ఫ్లాప్‌'గా 'కబాలి' నిలిచింది. ఇది జరిగిన కథ. అప్పుడే అయిపోలేదు, కథ ఇంకా వుంది. 

తాజాగా 'కబాలి' అమ్మకాలు షురూ చేసేశారు. సినిమాలో రజనీకాంత్‌ ధరించిన స్పెక్టకల్స్‌ నుంచి, వాచ్‌ వరకు... 'మర్చండైజ్‌' అమ్మకాల్ని మొదలు పెట్టేశారు. ఇంకేముంది, అభిమానులు పెద్దయెత్తున పోటీ పడనుండడం ఖాయం. అభిమానులు ఆక్షన్‌ ద్వారా వాటిని కొనుక్కోవాల్సి వుంటుంది. చాలా సినిమాలకు ఇలాంటి 'వేషాలు' వెయ్యడం చూశాం. అయితే, చాలా సందర్భాల్లో అలా ఆక్షన్‌ ద్వారా వచ్చిన సొమ్ముల్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించారు. 

కానీ, ఇక్కడ సేవా కార్యక్రమాల కోసం 'కబాలి' మర్చండైజ్‌ సొమ్ముని వినియోగించే అవకాశం లేదు. ఎందుకంటే, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు గనుక. ప్రీ రిలీజ్‌ జరిగిన హైప్‌లో నిర్మాత బాగానే క్యాష్‌ చేసుకున్నా, బయ్యర్లు - డిస్ట్రిబ్యూటర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో నష్టాలు భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో, ఆక్షన్‌ ద్వారా వచ్చే సొమ్ముతో, కాస్తయినా ఊరట పొందాలని అనుకుంటున్నారేమో.! 

హిట్టు సినిమాకి ఇలాంటి వేషాలు వర్కవుట్‌ అవుతాయేమోగానీ, ఫ్లాప్‌ సినిమాకి కూడా ఫలితం వుంటుందా.? వేచి చూడాల్సిందే. Readmore!

Show comments