అచ్చెన్నను వెటకారం చేస్తే బాబు కేంటి ఆనందం!

జట్టు నాయకుడు అనేవాడు.. తన జట్టులోని వారి స్ఫూర్తిని కాపాడేలాగా ఉండాలి. తన జట్టులోని వారి లోపాలను కూడా నలుగురిలో దాచిపెట్టి, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ తాను స్మార్ట్‌ సీఎం నని అనుకునే చంద్రబాబునాయుడు ఇన్ని విలువలు పాటిస్తారని అనుకోవడం భ్రమ. పాపం... ఏమాత్రం సంబంధంలేని అంశానికి సంబంధించి ఆయన తన మంత్రి వర్గ సహచరుడిని వెటకారం ఆడిన వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. 

వివరాల్లోకి వెళితే.. శనివారం నాడు.. కేబినెట్‌ సమావేశం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. పుష్కరాలను తాము అద్భుతంగా నిర్వహించేస్తున్నాం అంటూ తమను తాము కీర్తించుకోవడం ఒక్కటే ఫోకస్‌తో ఆ కేబినెట్‌ సమావేశం ప్రధానంగా ముగిసిపోయింది.సీ భేటీ తర్వాతనే.. చంద్రబాబు.. పీవీ సింధుకు 3 కోట్ల నజరానాను కూడా ప్రకటించారు. 

పీవీసింధు వ్యవహారం భేటీలో చర్చకు వచ్చినప్పుడు.. ఏపీ క్రీడల మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారుట. పీవీసింధు చాలా బాగా ఆడిందండీ.. అంటూ చంద్రబాబుతో చెప్పారుట. దానికి స్పందనగా, చంద్రబాబు చాలా వెటకారం చేస్తూ.. ఇక్కడ నువ్వే ఏమీ ఆడలేకపోతున్నావ్‌.. అంటూ అందరి ఎదుట అచ్చెన్నాయుడుపై జోకులేశారుట. నీ డిపార్టుమెంటు శుభ్రంగా పనిచేయడం లేదు.. అంటూ ఆయనమీద సెటైర్లు రువ్వారుట. శుభమా అని అభినందనలను పలకబోయినా కూడా.. ఇలాంటి ఎదురుదెబ్బ తగిలేసరికి పాపం అచ్చెన్నాయుడు సైలెంట్‌ అయిపోయారుట. అయినా.. అకారణంగా తన సొంత సహచరుల్ని నలుగురిలో ఇలా వెటకారం చేయడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదని పలువురు అంటున్నారు. 

Show comments