ఓ పల్లెటూరి చెవిటివాడి ప్రేమ కథను తీసుకుని, రామ్ చరణ్ తో సినిమాగా చేయాలని డిసైడ్ అయిపోయారు డైరక్టర్ సుకుమార్. అది కూడా 1990 దశకంలో. అంటే ఈ కాంటెంపరరీ యూత్ ఏదయితే గ్లామర్ అనుకుంటున్నారో ఆ సెల్ ఫోన్ లో, విండో షాపింగ్ లు, మల్టీ ఫ్లెక్స్ లు, మాల్స్ లేని కాలం బ్యాక్ డ్రాప్ లో. అలాంటి కథ తీసుకుని, నవంబర్ లో ప్రారంభిద్దామనుకున్న సినిమా ముహుర్తం, ఇదిగో, అదిగో అంటూ నెలలు దాటుకుంటూ వస్తోంది. ఆఖరికి అతి కొద్ది రోజుల్లో ముహుర్తం అనగానే హీరోయిన్ చేజారిపోయినట్లు బోగట్టా.
శతమానం భవతికి 24 లక్షలు తీసుకున్న అనుపమ పరమేశ్వరన్, ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి యాభైకి పైగా అడుగుతోందని, బేరాలు జరుగుతున్నాయని ముందే వెల్లడించాం. వీళ్లేమో ముఫై దాకా వెళ్లారు. ఇలా బేరాలు ఆడుతున్నపుడే డైరక్టర్ సుకుమార్ కు కోపం వచ్చి వేరే అమ్మాయిని చూడండి అని కూడా చేప్పేసాడు. అయితే ఎందుకొచ్చింది అని వీళ్లు ముఫై అయిదు దాకా వెళ్లి,. దాదాపు ఫిక్స్ చేసుకున్నారు.
కానీ మళ్లీ ఏమయిందో ఇప్పుడు అనుపమతో అగ్రి మెంట్ ను పక్కన పెట్టి వేరే అమ్మాయి కోసం వెదుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. అసలే సుకుమార్ సినిమా అంటే పది నెలలు పడుతుంది. పైగా హీరో చెవిటి వాడు అంటే కేవలం కళ్లతో, ముఖ కవళికలతో మాంచి హావ భావాలు పలికించాలి. రామ్ చరణ్ కు ఇది కత్తి మీద సవాల్ లాంటి పాత్ర. సరిగ్గా పండేవరకు సుకుమార్ ఒప్పుకోడు. అందువల్ల మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమై, ఎప్పటికి ఫినిష్ అవుతుందో? అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. దీనికి తోడు. ఇలా కాస్టింగ్ దగ్గరే ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కు అంటే ఎన్నాళ్లు పడుతుందో? మైత్రీ దగ్గర డబ్బులు వుంటే చాలదు..కొరటాల శివ కాదు, ఇలా సినిమా తీసి, అలా చేతిలో పెట్టడానికి.