త్రివిక్రమ్ అలా చేసారా?

పరిశ్రమలో కొత్త దర్ళకుల సంగతి పక్కన పెడితే, కాస్తో, కూస్తో ఎస్టాబ్లిష్ అయిన దర్శకులకు ఎవరి శైలి వారికి వుంటుంది. అందుకే ఒకరు తీసిన సినిమాను మరొకరు విడుదల కు ముందుగా చూసినా కూడా వీలయినంత వరకు ఏ విధమైన రిమార్కులు చేయరు. అయితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చూస్తే మాత్రం, కాస్త ఇలా అయితే బాగుండును, అలా అయితే బాగుండును అని చెబుతారు. 

ఎందుకంటే డబ్బు పెడతారు కాబట్టి వారికి ఆ హక్కు కూడా వుంటుంది. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన బాబు బంగారం విషయంలో ఇలాంటి విషయం ఒకటి చోటు చేసుకుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. బాబు బంగారం నిర్మాత లకు దర్ళకుడు త్రివిక్రమ్ అంటే మహా గురి. వారి పేరెంటెల్ బ్యానర్ హారిక హాసినిని వారు త్రివిక్రమ్ కే అంకింతం ఇచ్చేసారు. త్రివిక్రమ్ సలహా లేకుండా ఏ ప్రాజెక్టు్ చేయడం లేదు. 

ప్రేమమ్ సినిమా రీమేక్ ముందు కూడా త్రివిక్రమ్ కు మాతృక చూపించి, సలహాలు సూచనలు తీసుకునే స్టార్ట్ చేసారు.  అయితే ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటంటే, ఇటీవల బాబు బంగారం సినిమాను త్రివిక్రమ్ ప్రత్యేకంగా చూసారట. చూసి ఊరుకోకుండా కొన్ని సజెషన్లు లేదా రిమార్కులు చేసారని వినికిడి. అవి అమలు చేసారా, చేస్తారా అన్నది తెలియదు కానీ, త్రివిక్రమ్ ఇలా చేయడం సరికాదన్న కామెంట్లు మాత్రం ఇండస్ట్రీలో మెలమెల్లగా వినిపిస్తున్నాయి. 

మారుతి స్టయిల్ మారుతి ది . త్రివిక్రమ్ స్టయిల్ త్రివిక్రమ్ ది. అ..ఆ సినిమాను విడుదలకు ముందుగా ఏ డైరక్టర్ కయినా చూపిస్తే, ఆయన స్టయిల్ లో ఆయన బోలెడు రిమార్కులు చెప్పేవారేమో? అప్పుడు త్రివిక్రమ్ ఏమంటారు? ఎంత అభిమానం, గౌరవం వుంటే మాత్రం ఒక ఎస్టాబ్లిష్డ్ డైరక్టర్ సినిమాను మరో డైరక్టర్ కు చూపించి సలహాలు అడగడం సరికాదేమో? అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Show comments