అప్పుడు సెక్సిణి.. ఇప్పుడు యోగిని.!

ఏమో, కాలం ఎలాగైనా మారిపోవచ్చు. మొన్నటికి మొన్న 'సెక్సిణి' సోఫియా హయాత్‌, తాను 'నన్‌'గా మారిపోయానని ప్రకటిస్తే, ఇప్పుడు తాజాగా మరో 'సెక్సిణి' మమతా కులకర్ణి (బాలీవుడ్‌లో సెక్సిణి అన్న పదానికి ఈమెను తొలి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకోవచ్చునేమో) యోగినిగా మారిపోయానంటోంది. 

ఏంటి.? ఇదంతా నిజమేనా.? అడక్కండి, అదంతే. సోఫియా హయాత్‌ అందాల ప్రపంచంలో తనవంతుగా ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే చేసింది గనుక, ఆమెను ఏమీ అనడానికి వీల్లేదు. 'నన్‌'గా మారాలన్న ఆమె ఆలోచనని ఎవరూ కాదనలేరు. కానీ, మమతా కులకర్ణి విషయంలో అలా కుదరదు. ఎందుకంటే, డ్రగ్స్‌ రాకెట్‌లో ఆమె అడ్డంగా బుక్కయిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో 'డ్రగ్‌ మాఫియా' ఆరోపణలు ఎదుర్కొంటోంది మమతా కులకర్ణి. ఇప్పుడీమె యోగిని అయిపోయిందంటే ఏమనుకోవాలి.? 

ఎవరన్నా ఏమైనా అనుకోండి, నాకు సంబంధం లేదు.. అంటోన్న మమతా కులకర్ణి, తాను సీతా దేవి లాంటిదాన్నని చెబుతోంది. రావణాసురుడి చెర నుంచి సీతాదేవికి విముక్తి లభించినట్లు తాను డ్రగ్స్‌ రాకెట్‌ నిందితుడు విక్కీ గోస్వామి నుంచి విడిపోయానని మమతా కులకర్ణి చెప్పడం ఆశ్చర్యకరమే. వినేవాడు వెర్రి వెగళప్ప అయితే, చెప్పేటోళ్ళు మమతా కులకర్ణి లాంటోళ్ళు.. అనాలేమో ఇకపై. 

విక్కీ గోస్వామిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది మమతా కులకర్ణి. అతనితో ఇప్పుడు కలిసి లేదట. కానీ, అతను ఇంకా తనకు మంచి స్నేహితుడంటూ విక్కీ గోస్వామి చెబుతోంది. అంతేనా, ఇప్పుడు మమతా కులకర్ణి ఒంటరిగా వుంటోందట. అంతలోనే, విక్కీ గోస్వామిని రావణాసురుడు.. అంటోంది. వాట్‌ ఈజ్‌ దిస్‌ నాన్సెన్స్‌.?

Show comments