కబాలి ఎప్పుడొచ్చినా బాబు నెలాఖరుకే

కబాలి సినిమా కోసం వెయిటింగ్ బాబు బంగారం అన్నిది ఇండస్ట్రీ టాక్. కానీ విషయం ఏమిటంటే, బాబు బంగారం ఇంకా రెడీ కాలేదన్నది. ఓ పాట బ్యాలెన్స్ వుంది. ఇంకా బోలెడు పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా. పైగా పబ్లిసిటీ ఇంకా ప్రారంభించనే లేదు. అందువల్ల కబాలి రాకున్నా, జూన్ సెకండ్ వీక్ లో బాబు బంగారం వచ్చేంత సీన్ అక్కడ లేదు. 

అయితే కబాలి మూడోవారం లో వస్తే, అప్పుడు ఆఖరు వారంలో రావాలా వద్దా అన్న సమస్య వుంటుంది. కానీ కబాలి వచ్చే సూచనలు అయితే కనిపించడంలేదు. ఆగస్టు రెండో వారం అని అనధికారికంగా వినిపిస్తోంది. అందువల్ల బాబు బంగారం జూన్ ఆఖరి వారం అన్నది ఫిక్స్ అన్నమాట. హారిక హాసిని వారి కొత్త బ్యానర్ సితార ఎంటర్ టైన్మెంట్స్ పై విక్టరీ వెంకటేష్, నయన తార జంటగా మారుతి డైరక్షన్ లో నిర్మించిన చిత్రం ఇది,.

Show comments