ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల్లానే హైపర్ కూడా మొదటి మూడు రోజుల పాటు కలక్షన్లు బాగా రాబట్టుకుని ఆ తర్వాత చల్లబడిపోయింది. ఫస్ట్ వీకెండ్‌లో వచ్చిన వసూళ్లు చూసి సేఫ్ సినిమా అవుతుందని అనుకున్నారు కానీ తర్వాత కలక్షన్లు పడిపోయిన తీరు చూస్తే, దసరా సినిమాల ఫలితాల మీద దీని సేఫ్టీ ఆధారపడి ఉంటుందనుకోవాలి.
మజ్ను చిత్రం కొంతమందికి బ్రేక్ ఈవెన్ అయితే, కొందరికి మైనర్ లాస్‌లు మిగిల్చింది. ఓవరాల్‌గా ఇది అబౌ యావరేజ్ రేంజ్ చేరుకుంది. జాగ్వార్ చిత్రానికి అంతటా మంచి ఓపెనింగ్ వచ్చింది. కానీ సినిమా బాలేదనే టాక్ వల్ల, దసరాకి పోటీ ఎక్కువ ఉండడం వల్ల ఇది ముందుకెళ్లడం కాస్త కష్టమే.
దసరా సెలవులని క్యాష్ చేసుకోవడానికి ప్రేమమ్, ఈడు గోల్డ్ ఎహే, అభినేత్రి, మన ఊరి రామాయణం చిత్రాలు రిలీజయ్యాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు రావడం వల్ల కనీసం రెండయినా నష్టపోయే అవకాశముంది. ప్రస్తుతానికి ఏ సెంటర్స్‌లో ప్రేమమ్‌కి, బి,సిల్లో ఈడు గోల్డ్‌కి డిమాండ్ కనిపిస్తోంది.