పెళ్ళి ప్రచారంతో కెరీర్‌ని అటకెక్కించుకుంది హీరోయిన్ త్రిష. అఫ్‌కోర్స్.. అప్పటికే హీరోయిన్‌గా కెరీర్ డల్ అయిపోయిందనుకోండి.. అది వేరే విషయం. ప్రస్తుతం ఒకటీ అరా సినిమాల్లో అవకాశాలైతే దక్కుతున్నాయిగానీ, మళ్ళీ తాను మునుపటి జోరు అందుకునేందుకు అవసరమైన బిగ్ సక్సెస్ మాత్రం తనను ఇంకా ఊరిస్తూనే వుందని త్రిష చెబుతోంది.
తమిళంలోనేనా.? తెలుగులో ట్రై చేయడంలేదా.? అనడిగితే, తాను అవకాశాల కోసం ఎప్పుడూ ట్రై చేయలేదనీ, తన వద్దకు వచ్చిన అవకాశాల్లోంచి మంచి వాటిని ఎంచుకునే ఆప్షన్ తనకెప్పుడూ వుంటుందని అంటోంది త్రిష. ఇప్పుడు కూడానా.? అనడిగితే, 'వై నాట్..' అని సమాధానమిచ్చింది ఈ చెన్నయ్ బ్యూటీ. బాలీవుడ్‌లో కూడా ఓ అడుగు ఆల్రెడీ పెట్టేసినా, అక్కడ ఆమెకు ఫెయిల్యూర్ ఎదురవడంతో మళ్ళీ బాలీవుడ్ వైపు దృష్టి సారించలేదు.
ప్రస్తుతం తమిళంతోపాటు, టాలీవుడ్ నుంచీ అవకాశాలొస్తున్నాయనీ, త్వరలోనే ఓ తెలుగు సినిమాకి సంబంధించిన 'గుడ్ న్యూస్' చెబుతానంటోన్న త్రిషకి, బాలీవుడ్ నుంచీ అవకాశాలొచ్చేస్తున్నాయట. అవునా.? నిజమా.? బాలీవుడ్ నుంచి త్రిషకు ఛాన్సిచ్చేవారెవరబ్బా.? ఏమో మరి ఆమెకే తెలియాలి.