రాజమౌళికి రివర్స్ కొడుతోంది

బాహుబలి పార్ట్ వన్ లుక్ లు వదిలినపుడు జనం అహా..ఓహో అన్నారు. అదో సంచలనం. కానీ ఇప్పుడు పార్ట్ 2 దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. బాహుబలిలో భల్లాలదేవ పాత్ర ధారి రానా పుట్టిన రోజు సందర్భంగా మరోసారి కొత్తగా లుక్ వదిలారు. పార్ట్ వన్ కు టూ భల్లాల దేవ మారిపోడుగా. అయితే కథ ప్రకారం కాస్త యంగ్ గా వుంటాడు. కానీ ఈ లుక్ లో కూడా భల్లాలదేవకు కాస్త నెరిసిన జుట్టు, గెడ్డమే వున్నాయి. అయితే కామిక్ పుస్తకాలు, వీడియో గేమ్స్ లో కనిపించే చిత్రమైన కవచాన్ని తగిలించారు. ఇప్పుడు ఇదే నెటిజన్లు భలే జోకులు వేసుకోవడానికి దారి తీస్తోంది. ట్విట్టర్ లో కామెంట్ల మోత మోగిస్తోంది. ఇది కంకిపాడులో డిజైన్ చేయించారా? పచ్చ రంగు ఐరన్ మాన్ సూటు వేయించారా? కార్టూన్ స్టిల్ లా వుంది. విడియో గేమ్ లా వుంది అంటూ, పవర్ రేంజర్స్ ను కాపీ కొట్టారా? ఇలా రకరకాలుగా పంచ్ లు పేలిపోయాయి ట్విట్టర్ లో. తప్పదు. ఎందుకంటే పార్ట్ వన్ లో చూసిన మొహాలే. అందుకని గెటప్ లు మార్చాలి. ఎలా మారుస్తారు. అల్టిమేట్ గెటప్ లు అప్పుడే చూపించారు. ఇప్పుడేం చేసినా, ఇలాగే వుంటుంది మరి.

 

Show comments