ప్రకాష్ రాజ్ కు ఈ అతి అలవాటైపోయింది!

సినిమాల్లో ఈ తరహా మనస్తత్వం కూడిన పాత్రలు చాలానే చేశాడు నటుడు ప్రకాష్ రాజ్. మరి నిజజీవితంలోనూ ఈయన చాలా హైపర్ అని అనిపించుకుంటున్నాడు. ఒకసారి కాదు.. వరసగా ప్రకాష్ రాజ్ ఓవర్ రియాక్షన్లు వార్తల్లోకి వస్తున్నాయి. 

ఆ మధ్య కావేరీ జల వివాదం గురించి ఒక టీవీ చానల్ లైవ్ లో స్పందన అడిగినందుకు గానూ ప్రకాష్ రాజ్ రెచ్చిపోయాడు. టీవీ యాంకర్ మీద ధ్వజమెత్తాడు. వివాదాన్ని సృష్టించడానికే తన స్పందనను అడుగుతున్నారని అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు ఈ నటుడు.

ఇక ఇటీవల తిరుపతిలో ప్రకాష్ రాజ్ సహనం కోల్పోయాడు. కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చిన ఈయనను లోకల్ మీడియా ప్రతినిధులు ఎవరో.. జల్లికట్టు వ్యవహారం గురించి స్పందించమనగా, వీధి రౌడీలా రెచ్చిపోయాడు. మీడియా ప్రతినిధితో ఫైట్ చేశాడు!

ఈ సంగతులిలా ఉంటే.. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయాడు. తనను చూసి ముచ్చట పడి సెల్ఫీ దిగాలని వచ్చిన అభిమానికి షాక్ ఇచ్చాడు. సెల్ఫీ దిగాలనే యత్నం చేసిన అభిమాని నుంచి సెల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టి.. పగుల గొట్టాడు ప్రకాష్ రాజ్. నివ్వెరపోవడం ఆ అభిమాని వంతు అయ్యింది!

మరి ఇష్టం లేకపోతే.. వద్దని చెప్పడానికి చాలా దారులున్నాయి. మరీ ఇలా సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టడం అంటే టూమచ్. దీనిపై సదరు అభిమాని.. విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే ప్రకాష్ రాజ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు! 

Show comments