కొత్త డిజైనర్ రెడీనా?

వంశీ ఫ్యాషన్ డిజైనర్ గా ఎవరూ ఒక పట్టాన సూట్ అవుతున్నట్లు లేదు. ఎప్పుడో రవితేజ దగ్గర ప్రారంభమైంది వెదుకులాట.  అక్కడి నుంచి అల్లరి నరేష్ దగ్గరకు వచ్చింది. చిత్రమేమిటంటే, అప్పటికి ఇంకా ఓ అయిడియానే తప్ప పూర్తి స్క్రిప్ట్ లేదు. అల్లరి నరేష్ దగ్గర నుంచి బయటకు వచ్చాక ఈ టైటిల్ కు, లైన్ కు కాస్త స్క్రిప్ట్ వర్క్ కూడా తోడయింది. కానీ హీరో మాత్రం సెట్ కావడం లేదు. 

రాజ్ తరుణ్ అనుకుంటే, స్క్రిప్ట్ పూర్తిగా కావాలన్నాడు. ఆ తరువాత దగ్గుబాటి అభిరామ్ పేరు మాత్రం గ్యాసిప్ వార్తల్లో వినిపించింది. అదీ కాలేదు.ఆ తరువాత పూర్తిగా కొత్తవాళ్లతో కానీ, లేదా హీరో మినహా కొత్తవాళ్లతో కానీ చేయాలని, కాస్టింగ్ కాల్ ఇచ్చే ఆలోచనలో వున్నారని వార్తలు వినవచ్చాయి. 

లేటెస్ట్ గా తూనీగ కుర్రాడు, రైట్ రైట్ హీరో సుమంత్ అశ్విన్ పేరు వినిపిస్తోంది. కుర్రాడు చలాకీగా, ఫన్ బాగానే పండించే అవకాశాలు వున్నాయి. అందువల్ల వంశీ క్యారెక్టరైజేషన్ కు సూటయ్యేందుకు వీలుంది. మరి అతనే ఫిక్స్ అవుతాడేమో? ప్రస్తుతం అతగాడి చేతిలో కూడా పెద్దగా సినిమాలు లేవు మరి.

Show comments