టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరి చాలా మంచోడు

ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సిట్ దర్యాప్తు కూడా ముగిసి, ఇప్పుడిప్పుడే చల్లారుతుందనుకున్న ఈ వ్యహారాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు తమ్మారెడ్డి. పూరి జగన్నాథ్ చాలా మంచోడంటున్నారు.

"నేను 2-3 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నాను. డ్రగ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. ఇండస్ట్రీలోనే కాదు సమాజం మొత్తం ఉంది. పూరిజగన్నాథ్ రెగ్యులర్ గా ఎవరితో టచ్ లో ఉంటాడో వాళ్లలో 9మందినే ఇంటరాగేట్ చేశారు. అంటే డ్రగ్స్ కేవలం పూరి ఆఫీస్ లోనే ఉన్నాయా. వాళ్ల టీం మాత్రమే చేస్తోందా.. పరిశ్రమలో ఇంకెవరూ చేయడం లేదా. పూరి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. అతడు చాలా మంచోడు". డ్రగ్స్ కేసుపై తమ్మారెడ్డి వెర్షన్ ఇది.

కొండను వదిలేసి మట్టిని తవ్వుతున్నారన్న తమ్మారెడ్డి ఈ విషయంలో మీడియాను కూడా తప్పుబట్టారు. డ్రగ్స్ ఎలా తీసుకుంటారు, డ్రగ్స్ ఎక్కడ్నుంచి వస్తాయి లాంటి విషయాలపై ఫోకస్ తగ్గించి.. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా కథనాలు ఇస్తే బాగుండేదన్నారు.

"ఇది చాలా సింపుల్ కేసు. డ్రగ్స్ తీసుకున్న వాళ్లు సహాయ పునరావాస కేంద్రానికి వెళ్తారు. సప్లయ్ చేసేవాళ్లు జైలుకెళ్తారు. అంతకుమించి ఇంకేం జరగదు. ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనేది ఆలోచించాలి". ఇప్పుడేదో కొత్తగా టాలీవుడ్ లోకి డ్రగ్స్ వచ్చాయని అనుకోవడం పొరపాటు అంటున్నారు తమ్మారెడ్డి.

Show comments