బాహుబలి-2 : ఏపీ-తెలంగాణ వీకెండ్ వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబలి - ది కంక్లూజన్ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి వారాంతంలో ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 3 రోజుల్లో ఏకంగా 74 కోట్ల 30లక్షల షేర్ సాదించింది బాహుబలి-2 సినిమా. ఫస్ట్ వీకెండ్ లో ఓ సినిమా ఇన్ని వసూళ్లు సాధించడం ఓ చరిత్ర. మే డే హాలిడే సందర్భంగా ఈరోజు కూడా బాహుబలి-2 సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా వచ్చిన షేర్ (3 రోజుల్లో)
నైజాం - 19 కోట్లు
సీడెడ్ - 12.50 కోట్లు
ఉత్తరాంధ్ర - 9.28 కోట్లు
ఈస్ట్ - 8.72 కోట్లు
వెస్ట్ - 7.51 కోట్లు
కృష్ణా - 5.25 కోట్లు
గుంటూరు - 8.84 కోట్లు
నెల్లూరు - 3.20 కోట్లు

3 రోజుల్లో మొత్తం షేర్ - 74.30 కోట్లు

Show comments