మంచి ముహూర్తంలో బిరుదు.. 'స్త్రీ వాద సీఎం'

జర్నలిస్టు హోదాలో ఉన్న సాగరిక ఘోష్ కళ్లు మూసుకుని మాట్లాడుతున్నారో.. ఏపీలో మహిళలపై జరుగుతున్న దాష్టీకాలు టైమ్సాఫ్ ఇండియా కన్సల్టెంట్ ఎడిటర్ దృష్టికి రావడం లేదో ఏమిటో.. కానీ బాబును ఆమె ‘స్త్రీ వాద సీఎం’ గా అభివర్ణించారట! ఇక వెంకయ్య నాయుడు గారి కూతురు గారు.. బాబును స్త్రీ వాద సీఎం అన్నారంటే, అందులో అర్థం ఉంది.

ఇంకా జస్టిస్ రోహిణి, యూపీపీఎస్సీ మాజీ చైర్మన్ ఒకరు.. వీళ్లంతా కూడా బాబును ‘స్త్రీ వాద సీఎం’ గా ప్రశంసించారట. ఆయనకు ఆ బిరుదును ఇచ్చారట! నిజమే.. ఇంతకు మించిన ముహూర్తం ఏముంది? స్త్రీవాద మితవాద.. స్త్రీ హితకారుడు.. ఇలా ఏ బిరుదునైనా ఇవొచ్చు!

తెలుగుదేశం ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన తహసీల్దార్ వనజాక్షిని ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు. దాడికి గురైన ఆమెను హద్దుల్లో ఉండమని చెప్పి.. స్త్రీ సాధికారికతకు అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చారు. ఇక రిషితేశ్వరి ఆత్మహత్య వ్యవహారంలో దోషులకు ఇట్టే శిక్ష పడిపోయింది కదా! ఆ వ్యవహారంలో ‘కులం’ కోణం పంచాయితీని చేసి.. తమ వాళ్లను రక్షించుకుంది చంద్రబాబు ప్రభుత్వమే కదా.. అన్నాలి ‘స్త్రీ వాద సీఎం’ అని!

ఇక జానీమూన్ వ్యవహారం, అనంతపురంలో ఒక మహిళను ఎగెరిగెరి తన్నిన విధానం.. ఇవన్నీ కూడా బాబు గారి హాయంలో జరిగినవే.. అయితేనేం, ఇవన్నీ బాబుగారి మార్కు మహిళా సాధికారికతకు నిదర్శనాలు! ఇంతవరకూ ఎందుకు.. ఒక మహిళ ఎమ్మెల్యేను ఎన్ని ఇబ్బందుల పాల్జేస్తున్నారో, ఆమె విషయంలో ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో, ఆహ్వానం పంపించి మరీ ఆమెను ఎలా ముప్పు తిప్పలు పెడుతున్నారో.. అందరూ చూస్తూనే ఉన్నారు!

కాబట్టి.. చంద్రబాబుకు మించిన ‘స్త్రీ వాద సీఎం’ ఎక్కడ ఉంటాడు? అసలు ఉంటాడా? అందుకే.. చంద్రబాబుకు మించిన ‘స్త్రీ వాద సీఎం’ లేడు. ఆయన కోడలు నారా బ్రహ్మణి కూడా తమ మీడియా వర్గాలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. మామయ్యకు మించిన మహిళా హితకారుడు లేడని! కాబట్టి.. రాసుకోండి… అడ్డేముంది?

Show comments