బాలయ్య సినిమా రూపాయికే

వెరైటీ అయిడియా చేస్తే ఒప్పుకోవాల్సిందేగా. పొద్దుటూరు బాలయ్య ఫ్యాన్స్ ఓ మంచి అయిడియా చేసారు. బాలయ్య త్వరలో వందో సినిమా అందించబోతున్న సందర్భంగా వారు ఈ కొత్త అయిడియా వేసారు. ఇప్పటి దాకా బాలయ్య నటించిన 99 సినిమాలను ఒకే థియేటర్లో, రోజుకు ఒకటి వంతున 99 రొజులు అంటే సుమారు మూడు నెలలకు పైగా ప్రధర్శించాలని డిసైడ్ అయ్యారు. 

అంటే బాలయ్య చలన చిత్రోత్సవం అన్నమాట. అసలు 99 సినిమాల ప్రింట్ లు ఎక్కడ వున్నాయో, హక్కులు ఎవరి దగ్గర వున్నాయో, ప్రింట్ లు ఏ పరిస్థితుల్లో వున్నాయో, మొత్తానికి గట్టి ప్రయత్నమే చేసారు. అంతే కాదు. రోజుకు ఒక సినిమా నాలుగు ఆటలే. మర్నాడు మరో సినిమా. అంటే థియేటర్ కెపాసిటీని బట్టి మహా అయితే మాగ్జిమమ్ అయిదారువేల మందికి మాత్రమే ఆ సినిమాలు చూసే అవకాశం వుంటుంది. 

ఎందుకంటే అన్ని సినిమాలకు కలిపి సింగిల్ టికెట్ అన్నమాట. అది కూడా కేవలం వంద రూపాయిలకే. అంటే సినిమా రూపాయికే అన్నమాట. అర్చన థియేటర్ యజమాని  ఓబుల్ రెడ్డి, మరికొందరు అభిమానులు కలిసి ఈ ఫీట్ ను సాధ్యం చేసారు.

Show comments