మహాభారతమా.. నాకు డౌటే

వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతున్న మహాభారతం సినిమాపై నాగార్జున కూడా అనుమానం వ్యక్తంచేశాడు. "ఆ సినిమా వస్తుందా..నాకు డౌటే" అని రివర్స్ లో క్వశ్చన్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాపై నాగార్జున స్పందించడానికి ఓ కారణం ఉంది.

దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ప్లాన్ చేసిన మహాభారతం ప్రాజెక్టులో కర్ణుడి పాత్ర కోసం నాగార్జునను అనుకున్నారు. అది కూడా ఇప్పటిమాట కాదు. రెండేళ్ల కిందటి సంగతి. “అవును.. రెండేళ్ల కిందటే కర్ణుడి పాత్ర గురించి నాతో చర్చలు జరిపారు. అప్పట్లో వాసుదేవనాయర్ ఈ సినిమా స్క్రీన్ ప్లే పనుల్లో ఉన్నారు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు చూద్దామని అప్పుడే చెప్పాను” అన్నారు నాగ్.

యూఏఈకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఈ సినిమా ఎనౌన్స్ చేశాడు. కానీ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సో.. ఆ సినిమాపై నాగార్జునకు కూడా కూసింత అనుమానం ఉంది. ఫ్యూచర్ లో ఏదైనా అప్ డేట్ ఉంటే చెప్పమని పాత్రికేయులకు నాగ్ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందో లేదో తను చెప్పలేనన్న నాగ్.. సినిమా ఇప్పట్లో రాదని ఆఫ్ ది రికార్డు తేల్చిచెప్పేశాడు.

Show comments