పవన్ కొరటాల సినిమానే అది

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నుంచి పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడని, త్వరలోనే ఆ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడా ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనే విషయంపై కూడా చిన్న క్లారిటీ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఉంటుంది. 

శ్రీమంతుడు సినిమాతో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. తమ సెకెండ్ వెంచర్ గా ఈ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ సినిమాకు కూడా దర్శకుడు ఇతడే. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో చేయబోయే సినిమాకు కూడా కొరటాలే దర్శకత్వం వహిస్తాడట. ఈ మేరకు పవన్-కొరటాల మధ్య బేసిక్ లెవెల్లో స్టోరీ డిస్కషన్స్ జరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న కొరటాల, ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే పవన్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ గ్యాప్ లో పవన్ కూడా త్రివిక్రమ్, నేసన్ దర్శకత్వంలో సినిమాల్ని పూర్తిచేస్తాడు. 

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తరహాలోనే ఓ సందేశాన్నిచ్చేలా పవన్-కొరటాల సినిమా కూడా ఉండబోతోందట. దీనికి తోడు పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా  అతడి క్యారెక్టరైజేషన్ ఉంటుందని టాక్.

Readmore!
Show comments

Related Stories :