పవన్ ఫ్రెండ్ కన్ను ఆ సినిమాపై?

సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా అడియో ఫంక్షన్ కు స్పెషల్ అట్రాక్షన్ గా మెరిసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కడితో ఆ సీన్ అయిపోలేదని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా నిర్మాణానికి ఎంతయింది..సినిమా ఎలా వచ్చింది అన్నది పవన్ తన ఫ్రెండ్ శరద్ మురార్ ద్వారా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, ఓసారి సినిమా చూస్తానని శరద్ మురార్ ఆ సినిమా నిర్మాతలకు చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కేవలం కాజువల్ గా చూస్తానని అన్నారా? లెక్కలు ఆరా తీసారు అంటే, సినిమాను కొనే ఆలోచనలో వున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ అనుమానం ఎలా వున్నా, ఒకటి రెండు రోజుల్లో శరద్ మురార్ కోసం స్పెషల్ గా షో ఏర్పాటు చేసే ఆలోచనలో వున్నారట. మంచి చిన్న సినిమాలను కొని, తమ బ్యానర్ లో వదిలే ఆలోచన శరద్ మురార్ కు వుందని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా తన సినిమా వ్యాపారాన్ని విస్తరించే పనిలో శరద్ మురార్ వున్నారని టాక్.

Show comments