చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం!

సుధీర్ఘంగా సాగుతున్న ఇంగ్లండ్ తో సీరిస్ లలో ఆఖరి టీ20 లో భారత బ్యాటింగ్ ఆర్డర్ గర్జించింది. ఈ మ్యాచ్ గెలిస్తే.. టెస్టు, వన్డే, టీ20 సీరిస్ ల విజయం పరిపూర్ణం అయ్యే క్రమంలో భారత బ్యాట్స్ మన్ రాణించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల మోత మోగించారు.

ఆదిలోనే విరాట్ రనౌట్ అయినా.. ఆ తర్వాతి బ్యాట్స్ మన్ ఎక్కడా తగ్గలేదు. రైనా, ధోనీలు హాఫ్ సెంచరీలతో యువరాజ్ మెరుపులతో రాణించారు. నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ 202 పరుగులు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత ఇన్నింగ్స్  లో ఫోర్ల కన్నా సిక్సులే ఎక్కువ నమోదు కావడం.

భారత బ్యాట్స్ మన్ మొత్తం 11 ఫోర్లు కొట్టగా, ఇదే సమయంలో పన్నెండు సిక్సులు నమోదయ్యాయి. అత్యధికంగా రైనా ఐదు సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత యువరాజ్ ఒకే ఓవర్లలో మూడు సిక్సులు కొట్టాడు. ధోనీ రెండు సిక్సులు కొట్టగా పాండ్యా, లోకేష్ రాహుల్ లు చెరో సిక్సు కొట్టారు. ఫోర్ల విషయానికి వస్తే ధోనీ ఐదు ఫోర్లు కొట్టాడు. మిగతా బ్యాట్స్ మన్ ఫోర్ల కన్నా సిక్సులకే ప్రాధాన్యతను ఇచ్చారు.

Show comments