సోషల్ మీడియా ఆధారంగా జరిగే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని రాష్ట్ర పోలీసు పెద్దాయిన చెప్పేసారు. ఎవరో ఒకరు బాధ్యత వహించకుండా, కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ఆయన కరెక్ట్ గానే ప్రశ్నించారు. మరి ఈ రోజు ఉదయం నుంచి ఏవేవో ట్వీట్ లు చేస్తున్నారు. ఎక్కడెక్కడి సూక్తులో వల్లిస్తున్నారు. తన సినిమాల పాటలు తానే రీమిక్స్ చేయిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇన్ని చేసే బదులు ముందుగా అసలు కీలకమైన, అవసరమైన ఆ లేఖ ఏదో పోలీసు శాఖకు పంపేయవచ్చు కదా? అనుమతి ఇస్తారో? ఇవ్వరో తేలిపోతుంది. అప్పుడు భవిష్యత్ కార్యాచరణ తెలిసిపోతుంది. మరి పవన్ అలా రిక్వెస్ట్ లెటర్ ఇస్తారా? వేచి చూడాలి.
ముద్రగడకు బ్రేక్ వేసేందుకా?
కాపుల ఉద్యమనేత ముద్రగడ పాదయాత్ర డేట్ దగ్గరకు వచ్చింది. ఆల్ మోస్ట్ హవుస్ అరెస్టులోనే వున్నారు ఆయన. పైగా అక్కడ మరీ ఎమర్జెన్సీ టైపు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీడియా కళ్లకు గంతలు కడుతున్నారు. ఇంటర్ నెట్ బంద్ అంటున్నారు. అంత భయంకరంగా జరిగిన జల్లికట్టు ఉద్యమ సందర్భంగానే ఇలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ముద్రగడ విషయానికి వచ్చేసరికి బాబు ప్రభుత్వం చాలా కర్కశంగా వ్యవహరిస్తోంది.
హవుస్ అరెస్ట్ తప్పకపోవచ్చని పోలీసు పెద్దాయనే చెప్పేసారు. మరి ఈ వ్యవహారంపై ప్రజల దృష్టి పడకుండా పక్కకు తప్పించేందుకే పవన్ ఇదే సమయంలో విశాఖ వ్యవహారానికి తెరతీసారనీ వదంతులు వినిపిస్తున్నాయి. నిజం ఏమిటో ఆయనకే తెలియాలి. ఇదంతా అకస్మాత్తుగా, జల్లికట్టు చూసి జరిగింది కాదని, ఇప్పుడు విడుదల చేస్తున్న రీమిక్స్ పాటలు, పోస్టర్లే చెబతున్నాయి. ఇవన్నీ రాత్రికి రాత్రి పుట్టుకు వచ్చేయవు కదా?