నాగ్ చైతన్య సినిమాకు దేవీ?

అనూప్ రూబెన్స్..మిగిలిన సినిమాలు ఒక ఎత్తు..అన్నపూర్ణ స్టూడియోస్ కు చేసిన సినిమాలు ఒక ఎత్తు. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఒక లైలా కోసం, లాంటి సూపర్ హిట్ లు అనూప్-అన్నపూర్ణ కాంబినేషన్ లో వున్నాయి. కానీ అలాంటి అనూప్ ను పక్కన పెట్టి దేవీ శ్రీ ప్రసాద్ ను అన్నపూర్ణలోకి మరోసారి స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. 

మాస్ సినిమాకు దేవీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ తరువాత భాయ్ సినిమాకు దేవీ పనిచేసాడు. కానీ అద్భుతమైన సాంగ్స్ ఏమీ కావు. ఆ తరువాత అనూప్ అన్నపూర్ణలోకి వచ్చి చేరారు. కానీ మరోసారి దేవీతో ఓ సినిమా చేయాలని అన్నపూర్ణ సంస్థ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

కళ్యాణ్ కృష్ణ-నాగ చైతన్య కాంబినేషన్ లో ప్రారంభమయ్యే సినిమాకు దేవీని మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్-అఖిల్ కాంబినేషన్ లో సినిమా వుంది. మరి ఆ సినిమాకు అనూప్ నే తీసుకుంటారేమో? ఎందుకుంటే విక్రమ్ కుమార్ తెలుగులో చేసిన రెండు సినిమాలకు అనూప్ నే పని చేసాడు. అందువల్ల అదే కాంబినేషన్ రిపీట్ కావచ్చేమో?

Show comments