మెగాస్టార్‌తో పెట్టుకుంటే అంతే

'సరైనోడు'తో బ్లాక్‌బస్టర్‌ సాధించిన కేథరిన్‌కి ఆ తర్వాత చెప్పుకోతగ్గ అవకాశాలేం రాలేదు. 'ఖైదీ నంబర్‌ 150'లో 'రత్తాలు' పాట తనే చేయాల్సింది. కానీ లారెన్స్‌తో ఈగో క్లాష్‌ వల్ల కేథరిన్‌ని తొలగించారు. వేరే ఏదైనా సినిమా నుంచి ఇలా తప్పిస్తే అంత న్యూస్‌ అయ్యేది కాదేమో కానీ మెగాస్టార్‌ రీఎంట్రీ నుంచి తొలగించేసరికి బాగా ప్రచారమైంది.

దాంతో కేథరిన్‌ అంతకుముందు చేసిన విషయాలు కూడా డిస్కషన్‌లోకి వచ్చాయి. అమ్మాయికి తల పొగరు అని, లేదంటే మెగాస్టార్‌ చిత్రానికి కూడా అలా ఎందుకు ప్రవర్తిస్తుందని ఇండస్ట్రీలో చర్చ పెరిగిపోయింది. దాంతో కేథరిన్‌ కాండక్ట్‌పై రెడ్‌ ఫ్లాగ్‌ ఎగిరింది. అంతే ఇప్పుడు ఆమెకి అవకాశాలేమీ రావడం లేదు.

టెక్నీషియన్లతో నటీనటులకి చిన్నపాటి ఈగో క్లాష్‌లు సహజమైనప్పటికీ తొలగించేటంతగా కేథరిన్‌ ఏమి చేసిందో కానీ, కేవలం ఆ ఒక్క పాట మాత్రమే కాకుండా ఇప్పుడు చాలా చిత్రాల్లోనే అవకాశాలు కోల్పోతోంది. చిన్న ఈగో క్లాష్‌తో మొత్తంగా తన టాలీవుడ్‌ కెరీరే ప్రమాదంలో పడింది. 

Readmore!
Show comments