జేమ్స్ బాండ్ సినిమాలో ప్రియాంక చోప్రా

హాలీవుడ్ సినిమాలన్నీ ఒకెత్తు జేమ్స్ బాండ్ సినిమాలు మరో ఎత్తు. ఈ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచం దృష్టి మొత్తం అటువైపే ఉంటుంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ ల్లో ఒకటిగా పేరుతెచ్చుకున్న జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించడం ఎవరికైనా ఓ డ్రీమ్. ఆ కలకు ఒక మెట్టు దూరంలో ఉంది హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి రాబోతున్న జేమ్స్ బాండ్ కొత్త సినిమాలో... డానియల్ క్రెగ్ సరసన బాండ్ గర్ల్ గా మెరవనుంది మన ప్రియాంక చోప్రా. ఇదే కనుక జరిగితే జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ గర్ల్ గా నటించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించనుంది ప్రియాంక.

ఇప్పటికే క్వాంటికో సిరీస్ తో హాలీవుడ్ లో పాపులర్ అయింది ప్రియాంక. ఆమె నటించిన బేవాచ్ సినిమా ఈ నెల్లోనే హాలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే ప్రియాంకకు మరో 2 సినిమా ఆఫర్లు వచ్చాయట. వాటిలో ఒకటి జేమ్స్ బాండ్ సినిమా అని టాక్.

జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్ గర్ల్స్ కు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. "బ్రెయిన్ విద్ బ్యూటీ" అనేది మెయిన్ కాన్సెప్ట్. బాండ్ గర్ల్స్ అంతా చాలా తెలివైన వాళ్లు. అందగత్తెలు. సేమ్ టైం ధైర్యవంతులు కూడా. ఈ క్వాలిటీస్ అన్నీ ప్రియాంకలో పుష్కలంగా ఉన్నాయని, ఆమె పర్ ఫెక్ట్ బాండ్ గర్ల్ అంటూ ఫేస్ బుక్ లో ఇప్పటికే చర్చ మొదలైంది.

Show comments