మళ్లీ అదే జోడీ

జ్యో అచ్యుతానంద సినిమాలో రెజీనాతో జోడీ కట్టాడు నారా రోహిత్. ఆ సెంటిమెంట్ తోనో, మరి ఎందుకనో, మరోసారి రెజీనాతో సినిమాకు రెడీ అయిపోయాడు. కొత్త బ్యానర్ ఎస్ వి ఎమ్ పి ప్రొడక్షన్స్ సంస్థ నారా రోహిత్-రెజీనాల కాంబినేషన్ లో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టేసింది. రామానాయుడు స్టూడియోలో ఆదివారం జరిగిన ఈ కొత్త సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కు దర్శకుడు వివి వినాయక్, నిర్మాతలు కేఎస్ రామారావు, బెల్లంకొండ సురేష్ హాజరయ్యారు. బాహుబలితో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ హెవీ క్యారెక్టర్ చేస్తోంది.

వినాయక్ క్లాప్ కొట్టిన ఈ సినిమాకు దర్శకుడిగా పవన్ మల్లెల పరిచయం అవుతున్నారు. నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణలతో పాటు అజయ్, పృధ్వీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సత్య రాజేష్, దువ్వాసి మోహన్ లాంటి ఫన్ బ్యాచ్ ప్యాడింగ్ వుంది. మహేంద్ర బాము, వంశీకృష్ణ, నందమూరి వినోద్ నిర్మాతలు. ఈ సినిమా సంగతి ఇలా వుంటే,  నారా రోహిత్ లేటెస్ట్ మూవీ కథలో రాజకుమారి విడుదలకు రెడీ అవుతోంది.

Show comments