మళ్లీ బాంబు పేలిందిగా?

టాలీవుడ్ లో మరోసారి మాదక ద్రవ్యాల బాంబ్ పేలింది. నిన్నటికి నిన్న సిటీ పోలీసులు అత్యాధునిక మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న కొందరి పట్టుకుని, వాళ్ల ఫోనుల్లోని సమాచారాన్ని సేకరించారు.

ఈ క్రమంలో ఒక బడా నిర్మాత కూడా మాదక ద్రవ్యాల కోసం ఇండెంట్ పెట్టినట్లు బయటపడింది. ఆ బడా నిర్మాతను సోమవారం తమ దగ్గరకు రమ్మనమని పోలీసులు సమన్ చేసారట.

ఇప్పుడు టాలీవుడ్ జనాల్లో ఎవరా నిర్మాత? అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. గతంలో సినిమా రంగానికి చెందిన కొందరిపై, అలాగే కొన్ని వ్యాపారాలపై  పోలీసులు నిఘా పెట్టారని వార్తలు వచ్చాయి. కొందరి పేర్లు వినిపించాయి. కొందరిపై కేసులు పడ్డాయి. ఆ తరువాత మళ్లీ అవన్నీ ఏమయ్యాయో తెలియదు. 

ఇన్నాళ్ల తరువాత మళ్లీ ఇప్పుడీ బాంబు లాంటి వార్త. దీంతో ఈ వ్యవహారంపై ఆసక్తి కనబరుస్తూనే, గట్టిగా పెదవి విప్పడానికి జంకుతున్నారు. మరి ఇంతకీ సదరు నిర్మాత ఈరోజు పోలీసులను కలిసారో? లేదో? అసలు వివరాలు అన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో? ఎన్ని లింకులు వెలుగు చూస్తాయో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా వున్నాయి.

Show comments