ఇక అఖిల్ తో సినిమా లేనట్టేనా..!

తన రెండో సినిమాను దర్శకుడు హను రాఘవపూడితో చేయాలనుకున్నాడు అఖిల్. ఈ విషయాన్ని అప్పట్లో తనే స్వయంగా వెల్లడించాడు కూడా. కానీ అప్పటికే కుదుర్చుకున్న అగ్రిమెంట్ కారణంగా నితిన్ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు హను. అలా "లై" సినిమా తెరకెక్కుతోంది. సో.. ఈ మూవీ తర్వాత అఖిల్-హను కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా వర్కవుట్ అయ్యేలా లేదు.

నితిన్ తో సినిమా పూర్తికాగానే మరోసారి నానితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు హను రాఘవపూడి. ఈ విషయాన్ని నాని పక్కా చేశాడు. ఈ ఏడాది చివరి నాటికి నాని-హను కాంబోలో సినిమా స్టార్ట్ అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా చేశారు. ఇప్పుడు ఇంకో సినిమా షురూ చేయబోతున్నారు.సో.. అఖిల్ తో హను రాఘవపూడి సినిమా ఉంటుందా ఉండదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అఖిల్... తన మూడో సినిమాను హను డైరక్షన్ లో ప్లాన్ చేసుకున్నాడు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఒకవేళ హను రాఘవపూడితోనే సినిమా చేయాలనుకుంటే వచ్చే ఏడాది వరకు అఖిల్ వెయిట్ చేయాల్సిందే. ఈలోగా ఎన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోతాయో ఏమో !

Show comments