పాపం ఏపీ పర్స్

అందరికన్నా తనే ముందుండాలని, ముఖ్యంగా టెక్నాలజీని వాడుకోవడంలో తనకు మించిన వారు వుండకూడదని ఆంధ్ర ముఖ్యమంత్రికి మా చెడ్డ కోరిక. జనం నోట్లు లేక నానా బాధలు పడుతుంటే, రాష్ట్రంలో 80 శాతం గ్రామాలకు సరైన టూ జీ సేవలే లేని పరిస్థితి వుండగా, జనం అంతా మొబైల్ వాలెట్ లు వాడడం నేర్చుకోండి అంటూ బాబు గారు పిలుపు ఇచ్చారు. 

ఇప్పటికే పేటియం, ఎయిర్ టెల్ మనీ లాంటి ప్రయివేట్ డిజిటల్ వాలెట్ లు బోలెడు వున్నాయి. పైగా ప్రతి బ్యాంక్ కూడా ఇలాంటి డిజిటల్ వ్యాలెట్ లు ప్రవేశ పెట్టాయి. వీటిపై జనాన్ని ఎడ్యుకేట్ చేయడం, బ్రాండ్ బ్యాండ్ సర్వీసులను గ్రామాలకు పటిష్టం చేయడం వంటివి చేయకుండా, ఎపి ఫైబర్ నెట్ ద్వారా APPurse అనే అప్లికేషన్ ను రూపొందింపచేసారు. 

ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ వ్యాలెట్ ఏమో అనుకంటే, అది కాదట. అన్ని డిజిటల్ వ్యాలెట్ లకు దారి తీసే గేట్ వే లాంటి ప్రయోగం అంట. సాదారణంగా కొత్త అప్లికేషన్ వస్తే, ట్రయ్ చేయడానికైనా నెటిజన్లు ఆసక్తి కనబరుస్తారు. కానీ ఈ ఎపిపర్స్ అప్లికేషన్ ను జస్ట్ వెయ్యి మంది మాత్రమే ఇప్పటికి డౌన్ లోడ్ చేసుకున్నారు. పైగా డౌన్ లోడ్ చేసుకున్నవారి రివ్వూలు కూడా ఏమంత ఎంకరేజింగ్ గా లేవు. 

ఇదంతా హడావుడిగా, జనాల అవసరాలు, అలాగే ప్రస్తుతం వున్న అప్లికేషన్ల మంచి చెడ్డలు చూడకుండా, ఏదో ఒక అప్లికేషన్ మనది వుండాలి. అలా చేసిన ఘనత సాధించాలని కిందా మీదా పడిపోయి, రాత్రికి రాత్రి ఏదో ఒకటి అందించేసినట్లు వుంది తప్ప, ఉపయోగం, ఫలితం రెండూ వుండేలా అయితే కనిపించడం లేదు.

Show comments