నోటి దురదకి అరెస్ట్‌ తప్పలేదు మరి.!

వాల్మీకితో తన బాయ్‌ఫ్రెండ్‌, సింగర్‌ మికా సింగ్‌ని పోల్చి నోటి దురద తీర్చుకుంది రాఖీ సావంత్‌ గతంలో. ఆ కేసులో ఇప్పుడు తాజాగా ఆమె అరెస్ట్‌ కావడం విశేషమే మరి. వాల్మీకి ఎలాగైతే దొంగ నుంచి మహోన్నతమైన వ్యక్తిలా మారాడో, మికా సింగ్‌ కూడా అలా మారిపోయాడంటూ రాఖీ సావంత్‌ కొన్నాళ్ళ క్రితం వ్యాఖ్యానించడమే వివాదానికి కారణం. వాల్మీకిని దొంగ అంటావా.? పైగా, అంతటి మహోన్నతమైన వ్యక్తిని మికా సింగ్‌తో పోల్చుతావా.? అంటూ కొందరు రాఖీసావంత్‌పై కోర్టును ఆశ్రయించారు. 

ఈ కేసులో విచారణకు రాఖీ సావంత్‌ హాజరై వుంటే వ్యవహారం అరెస్ట్‌దాకా వచ్చి వుండేది కాదు. పలుమార్లు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరగడంతో, న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడం, పోలీసలు ఆమెను అదుపులోకి తీసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే, రాఖీ సావంత్‌ మాత్రం 'నేనేమీ తప్పుగా మాట్లాడలేదు.. చిన్నప్పుడు చదువుకున్న విషయాల్నే ప్రస్తావించాను.. పుస్తకాల్లో వున్నదే కదా నేను చెప్పింది..' అంటూ ఇంకా బుకాయిస్తూనే వుంది. 

అన్నట్టు, రాఖీసావంత్‌కి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఆమె మీద కేసులు నమోదయ్యాయి కూడా. అయితే, ఆ కేసుల్లోంచి రాఖీ సావంత్‌ చాలా తెలివిగా తప్పించుకుంది కూడా. ఈసారి మాత్రం వ్యవహారం అరెస్ట్‌దాకా వెళ్ళిపోయింది. అఫ్‌కోర్స్‌, రాఖీసావంత్‌కి అరెస్ట్‌ పెద్ద మేటర్‌ కాదనుకోండి.. అది వేరే విషయం. మొత్తమ్మీద, సెక్స్‌బాంబ్‌గా లెక్కలేనన్ని వివాదాలు ఎదుర్కొన్న రాఖీసావంత్‌ నోటిదురదకి ఇలా చిన్న 'బ్రేక్‌' పడిందన్నమాట.

Show comments