మోడీ పాలన వేస్ట్ -పవన్

ఇంక క్లియర్. ఇంత కచ్చితంగా చెప్పేసాక క్లియర్ కాక ఏముంటుంది. ఫక్తు రాజకీయ నాయకుడిలా నాలుక మడతేస్తే ఏమో కానీ, లేదూ అంటే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ది ఏంటీ మోడీ స్టాండ్ అని తేలిపోయింది. ఆయన అన్నారంటూ ఈ రోజు మీడియాలో వచ్చిన ఒకటి రెండు లైన్లు చాలు, పవన్ స్ట్రాటజీ ఇదే అనుకోవడానికి. ఇంతకీ పవన్ ఏమన్నారు..'' అధికారంలోకి వచ్చాక.. మోదీ మతోన్మోదాన్ని పెంచుతున్నారు, పౌరుల స్వేచ్ఛను హరిస్తున్నారు, నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారు. ఇలాంటి పాలన దేశానికి ఉపయోగకరం కాదు',,. ఇవీ పవన్ ప్రవచించింది. 

ఇంత నిక్కచ్చిగా మోడీని పవన్ ద్వేషించడం వెనుక కారణం మరేమీ కాదని, ఇదంతా చంద్రబాబు స్ట్రాటజీ అనే రాజకీయ పరిశీలకుల అంచనా. ఏంటీ మోడీ ఓటు తెలుగుదేశం పార్టీకి రాదు కాబట్టి, దాన్ని జనసేన వైపు మళ్లించడం, అలాగే కమ్యూనిస్టులు ఇటు రారు కాబట్టి, వాళ్లను జనసేనతో జత చేయడం అనే స్ట్రాటజీతో పవన్ చేత ఈ ఎత్తుగడ ఎత్తించారని భావిస్తున్నారు. బిసిల ఓట్లు దేశానికి కాపుల ఓట్లు జనసేనకు పంపకం అవుతాయన్నది తెలుగుదేశం ఆలోచనగా కనిపిస్తోంది. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు వేరువేరుగా వుండి, ఎన్నికలు ముగిసేక పొత్తులు పెట్టుకుంటే అటు భాజపా అయినా, ఇటు వామపక్షాలు అయినా ఇక చేసేది ఏమీ వుండదు. పైగా ముక్కోణపు పోటీలో జగన్ ఒంటరిపోరు సాగించాల్సి వస్తుంది.

Show comments