చేసే ప్రతి సినిమాకీ 'కెరీర్‌లో ఇది నాకు వెరీ వెరీ వెరీ స్పెషల్' అంటూ ఆ సినిమాకి చెందిన నటీనటులు, దర్శకులు చెబుతుండడం మామూలే. కొన్ని సినిమాల విషయంలో మాత్రం, ఆయా నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు ఎంతో భావోద్వేగానికి గురవుతూ ఆ సినిమా గురించి చెబుతుంటారు. తాప్సీ తన తాజా చిత్రం 'పింక్' గురించి కూడా ఇలాగే చెప్పింది. ఈ సినిమాలో లైంగిక దాడి బాధితురాలిగా తాప్సీ నటిస్తోంది.
బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో 'పింక్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా నటిస్తున్నాడు. సెక్సువల్ హెరాష్‌మెంట్‌కి గురైన బాధితురాలిగా తాప్సీ నటిస్తోంది. ట్రైలర్ అంతా కోర్టులో జరిగే సన్నివేశాల చుట్టూనే రూపొందించినట్లున్నారు. పవర్‌ఫుల్ డైలాగులతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.. అన్నట్లుగా అత్యద్భుతంగా ట్రైలర్‌ని రూపొందించారు.
ఇదో థ్రిల్లర్ మూవీ. తాప్సీతోపాటు ఈ సినిమాలో కృతి కుల్హారి, ఆండ్రియా తదితరులు 'పింక్'లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ని చూస్తోంటే, తాప్సీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా అన్పిస్తోంది. అమితాబ్ మరోమారు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు.