ఐమాక్స్ లో కుమ్ముడే కుమ్ముడు

హైదరాబాద్ ఐమాక్స్ లో బాస్ ఈజ్ బ్యాక్ ఎఫెక్ట్ భయంకరంగా కనిపిస్తోంది. మెగాస్టార్ సినిమా ఖైదీ నెం 150 బుకింగ్ ఓపేన్ చేసిన గంట లోపే భయంకరమైన రెస్పాన్స్ కనిపించింది.

మొదటిరోజు ప్లాన్ చేసిన ముఫైకి పైగా షోలు అన్నీ ఫుల్ అయిపోయాయి. మొత్తం ఐమాక్స్ స్క్రీన్లు అన్నీ మొదటి రోజు ఈ సినిమాకే కేటాయించేసారు. దీంతో మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు సుమారు ముఫై కి పైగా సినిమాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అవన్నీ ఫుల్ అయిపోయాయి. అంటే ఈ లెక్కన ఏ తొలి రోజు రికార్డు కోసం మెగా క్యాంప్ సినిమాకు మాగ్జిమమ్ హైప్ తీసుకువస్తోందో, అది నెరవేరినట్లే అనుకోవాలి.

ఇదిలా వుంటే ఆంధ్ర అంతా అర్థరాత్రి దాటిన తరువాత షోలు ప్రదర్శించేందుకు ఎక్కడికక్కడ లోకల్ గా అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెల్లవారి ఆరు గంటల నుంచే షోలు ప్రారంభమవుతాయని వినికిడి. తొలి రోజు ప్రతి థియేటర్ లో కనీసం ఆరు షోలు వుండే అవకాశం వుందని తెలుస్తోంది.

Show comments