మా టీవీకి నిమ్మగడ్డ సమస్య?

మాటీవీ లైసెన్స్ లు రెన్యూవల్ వ్యవహారం ఇబ్బందుల్లో పడింది. మాటీవీ డైరక్టర్ నిమ్మగడ్డ ప్రసాద్ పై ఆర్థిక నేరారోపణలు వుండడంతో మా టీవీ గ్రూప్ చానెళ్ల రెన్యువల్ కు కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ విభాగం నో అనేసింది. దీంతో ఇప్పుడు తరువాత ఏంటీ? అన్నది ఆలోచనగా మారింది. 

అయితే మా టీవీ మొత్తాన్ని స్టార్ గ్రూప్ కొనేసినందున, ముందు టైటిళ్లను తన పేరిటకు మార్చుకుని, ఆ పైన తాను రెన్యువల్ కు ప్రయత్నించే అవకాశం వుందని తెలుస్తోంది. జగన్ కేసుల్లో నిమ్మగడ్డకు కూడ లింక్ లు వున్న సంగతి తెలిసిందే. అయితే, సెక్యూరిటీ రీజన్స్ తో రెన్యూవల్ కు అడ్డం పడడం అన్నది నిబంధనలకు విరుద్ధం అని మా టీవీ యాజమాన్యం భావిస్తోంది. 

మా టీవీ ని స్టార్ కు విక్రయించేసినా, దాని విషయాల్లో కీలకంగా వున్న చిరంజీవి, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు అందరూ చంద్రబాబు పార్టీకి అనుకూలురు కాకపోవడం ఇక్కడ గమనార్హం.

Readmore!
Show comments

Related Stories :