ఇలా నవ్వులపాలైనప్పుడు.. ఈ ఎమ్మెల్యే మా వాడు కాదు అని తెలుగుదేశం వాళ్లు వాదించగలరు. అయితే ఆయన మెడలో తెలుగుదేశం కండువా పెద్దదొకటి వేసుకున్నాడు. ఆ పచ్చ కండువాకు ఒక వైపు చంద్రబాబు, మరోవైపు ఎన్టీఆర్ బొమ్మలున్నాయి. ఆఖరికి తెలుగుదేశం లోనే పుట్టి పెరిగిన ఎమ్మెల్యేలైనా అంత పెద్ద పచ్చ కండువాలు వేసుకుంటారో లేదో కానీ జలీల్ ఖాన్ మాత్రం ఆ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు పెద్ద కండువానే వేసుకున్నాడు. కొత్త బిచ్చగాడి చందానా.. ఆయన పచ్చ చొక్కాని అనిపించుకోవడానికి తాపత్రయ పడ్డాడు.
ఇక ఈ గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు తనకు మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే చాలా ఆసక్తి అని చెప్పుకొస్తూ, అందుకే బీకామ్ చదివానని నొక్కి వక్కాణించడం నవ్వులపాలు వ్యవహారంగా మారింది. బీకామ్ లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఏమిటండీ? అంటూ ఆ ఇంటర్వ్యూయర్ అడిగినా, తన అసబంద్ధమైన మాటలనే జలీల్ ఖాన్ సమర్థించుకొంటూ మరింత కామెడీ చేశాడు. అకౌంట్స్ అంటే మ్యాథ్స్ అని, బీకామ్ లో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ అంటూ.. సినిమాల్లో కామెడీకి తీసిపోని రీతిలో రెచ్చిపోయాడీయన.
మరి ఈ రోజుల్లో రాజకీయ నేతలు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటే జనాలు ఊరికే ఉండరు కదా, అందుకే.. ఈ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ జాతీయ మీడియా వరకూ వెళ్లింది! ఫేస్ బుక్ లో పొలిటికల్ సెటైర్స్ సబ్జెక్టుగా నడిచే పేజీలకు కూడా అందింది. బీకామ్ లో ఫిజిక్స్ చదివానని చెప్పుకుంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యే.. అంటూ నేషనల్ లెవల్లో బాగా ఫేమస్ అయిన కొన్ని ఫేస్ బుక్ పేజీలు జలీల్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియోలో కామెడీ పార్టును షేర్ చేస్తున్నాయి.
తెలుగులో జరిగిన ఇంటర్వ్యూను.. ఇంగ్లిష్ లోకి ట్రాన్స్ లేట్ చేసి, సబ్ టైటిల్స్ వేసి మరీ జనాలకు జలీల్ ఖాన్ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ లు. ఎమ్మెల్యే హోదాలోని వ్యక్తి ఇలా పరాకాష్ట స్థాయి కామెడీని చేయడం అంటే మామూలు విషయం కాదు కదా! మొత్తానికి ఈ కామెడీ ఎపిసోడ్ తో జలీల్ ఖాన్ జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నట్టే! వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఈయనను పక్కరాష్ట్రంలో కూడా నిలబెట్టుకోవచ్చు.. ఎంతైనా జాతీయ పార్టీ కదా!