మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున.. అంటే, ఈ నెల 22న ఆయన కొత్త సినిమా 'ఫస్ట్ లుక్' విడుదలవుతుందని ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ప్రస్తుతానికైతే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇంకా సందిగ్ధం కొనసాగడంలేదు. హీరోయిన్ విషయంలోనూ అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టతా ఇవ్వని పరిస్థితి. కాజల్‌ని అనుకున్నారన్న మాట మాత్రమే ఇప్పటిదాకా విన్పిస్తోంది.
22వ తేదీన లుక్ రిలీజ్ చెయ్యాలంటే, టైటిల్ వుండాల్సిన అవసరమైతే లేదు. హీరోయిన్ విషయంలోనూ అంతే. కానీ, కన్‌ఫ్యూజన్‌ని తొలగించాలంటే మాత్రం స్పష్టమైన ప్రకటన ఇవ్వక తప్పదు. నిర్మాత రామ్‌చరణ్, ఓ పక్క తన సినిమా 'ధృవ' పనుల్లో బిజీగా వున్నాడు. హీరోగా 'ధృవ' సినిమా సంగతుల్ని చక్కబెడుతూనే, తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా నిర్మాణ బాధ్యతల్ని చూసుకోవడం రామ్‌చరణ్‌కి కాస్త కష్టమైన వ్యవహారమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
ఇదిలా వుంటే, 'ధృవ' టీజర్, ఆగస్ట్ 22న విడుదలయ్యే అవకాశాలున్నాయన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. 'ధృవ' ఫస్ట్ లుక్ వచ్చేసింది. 'ధృవ' టీజర్ సంగతెలా వున్నా, చిరంజీవి కొత్త సినిమా లుక్ గురించి (టైటిల్‌తోపాటు) అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాత రామ్‌చరణ్‌కీ, దర్శకుడు వినాయక్‌కీ టైటిల్ విషయంలో కాస్త 'గ్యాప్' వుందనీ, అందుకే టైటిల్‌పై కన్‌ఫ్యూజన్ కొనసాగుతోందనీ ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆగస్ట్ 22 నాటికి అన్నీ సర్దుకుంటాయా.? అభిమానుల ముందుకు టైటిల్‌తో కూడిన లుక్, హీరోయిన్‌పై క్లారిటీ వచ్చేస్తాయా.? వేచి చూడాల్సిందే.