చిరు సినిమా షూటింగ్ షురూ

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా కత్తిలాంటోడు షూట్ ప్రారంభమైంది. మెహదీపట్నం ప్రాంతంలో ఈ రోజు షూటింగ్ మొదలైంది. చిరంజీవి, కమెడియన్ ఆలీ ల కాంబినేషన్ లో కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయక దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

చాన్నాళ్ల గ్యాప్ తరువాత చిరు షూటింగ్ లో పాల్గొంటున్నందున, మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్, బన్నీ తదితరులు అంతా షూటింగ్ స్పాట్ కు వచ్చారు. ఇక్కడి నుంచి ఈ షూట్ ఇలా రెగ్యులర్ గా సాగుతుంది. శుక్రవారం రాత్రి హైటెక్ సిటీ ఫ్లయ్ ఓవర్ పై షూట్ జరుపుతారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show comments