పిక్‌ టాక్‌: పూనమ్‌ శృంగార 'యోగం'

బంచిక్‌ బంచిక్‌ చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా.. అంటూ చాన్నాళ్ళ క్రితం ఓ తెలుగు సినిమా పాటొచ్చింది. ఆ పాటలో హీరోయిన్‌ గ్లామర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో ఆ పాట సూపర్‌ హిట్‌. యోగాసనాల గొప్పతనమేమోగానీ, ఆ పేరుతో హీరోయిన్‌ ఒలకబోసిన గ్లామర్‌ అప్పట్లో పెద్ద సంచలనం. 

ఇక, ఈ ఫొటోలో 'పాప' ప్రదర్శించిన శృంగార 'యోగం' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలిందులో యోగా ఎక్కడుందని ప్రశ్నిస్తారా.? అయితే అది మీ తప్పు కాదు. కానీ, ఆ బ్యూటీ ఏం చెబితే అది వినాల్సిందే. పరిచయం అక్కర్లేదామె గురించి. ఆమె మరెవరో కాదు, పూనమ్‌ పాండే. అప్పుడెప్పుడో వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ మీద టీమిండియా గెలిస్తే, మైదానంలో నగ్నంగా తిరుగుతానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసి, వార్తల్లోకెక్కి, వివాదానికి కారణమయి.. పాపులారిటీ సంపాదించుకుందీ భామ. 

ఈ మధ్య సోషల్‌ మీడియా వేదికగా నానా 'యాగీ' చేస్తున్న పూనమ్‌ పాండే, అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అందరికీ పెద్ద షాకే ఇచ్చింది ఈ ఫొటోతో. నాన్సెన్స్‌ ఇదేం యోగా.? అసలు యోగా అంటే తెలుసా.? అని నెటిజన్లు విరుచుకుపడ్తోంటే. నాకు తెలిసిందే యోగా.. అదే శృంగార యోగం.. జస్ట్‌ సీ అండ్‌ ఎంజాయ్‌.. అంటూ తన మీద వస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇస్తోంది పూనమ్‌ పాండే. ఆమె ఏం చేసినా అంతే మరి.!

Show comments