టాప్ డైరక్టర్లు టాలీవుడ్ లో ముగ్గురో నలుగురో వున్నారు. కానీ కొరటాల శివ క్రేజ్ వేరుగా వుంది. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా ప్రింట్, వెబ్ మీడియాలో వెల్లువైన ప్రకటనలే అందుకు సాక్ష్యం. ఎందుకు ఇలా? రాజమౌళి, త్రివిక్రమ్ ఇలా మరి కొంత మంది వున్నారు. కానీ కొరటాల కే ఎందుకిలా?
కొరటాల అడ్వాంటేజ్ లు ఆయనకు వున్నాయి. అదే అసలు సంగతి. మాస్ ప్లస్ క్లాస్ కలిపితే కొరటాల శివ. అది త్రివిక్రమ్ కూడా కదా ? కానీ టైమింగ్ లో కొరటాల శివ పెర్ ఫెక్ట్..సినిమాను పక్కా ప్లాన్డ్ గా తీసుకుని వెళ్తారు. వంద కోట్ల సినిమా కు కేరాఫ్ అడ్రస్..మరి రాజమౌళి కూడా కదా..కానీ కొరటాల శివ ఆరునెలలకో సినిమా చేయగలరు..అదీ ప్లస్.
అందుకే ఇప్పుడు నిర్మాతలంతా కొరటాల వైపు చూస్తున్నారు. పైగా కొరటాల వీళ్లతోనే చేస్తా..వాళ్లతొ చేయను అని లేదు. యువి క్రియేషన్స్ కు చేసారు..ఆ పై మైత్రీ మూవీస్ కు రెండు సినిమాలు. తరువాత దానయ్య అడ్వాన్స్ వుంది. ఎప్పుడో స్టార్ట్ చేసి క్యాన్సిల్ అయిన బండ్ల గణేష్ అడ్వాన్స్ కూడా అలాగే వుంది.
ఇప్పుడు కొత్తగా మరి కొంత మంది ఆయన జాబితాలో చేరారు. అలాగే హీరోలు కూడా..రామ్ చరణ్ ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మహేష్ బాబు మళ్లీ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. బాలకృష్ణ అయితే తన కొడుకు కోసం ఓ సినిమా చేయించాలి అనుకుంటున్నాడు. బన్నీ సంగతి సరేసరి. ఇలా చాలా మంది దృష్టి కొరటాల పై వుంది. జనతా గ్యారేజ్ తో హాట్రిక్ కొట్టేస్తే..ఇక కొరటాల టాప్ చైర్ లో కూర్చుంటాడు..బోలెడు అడ్వాంటేజ్ లతో.