ప్రియాంక గోల: ఛీ పాడు.. ఇదేం రచ్చ.?

కొన్ని వివాదాలు కామెడీగా వుంటాయి. ఇంకొన్ని జుగుప్సాకరంగా వుంటాయి. ఏ వివాదమైనా అంతిమంగా ఆయా సెలబ్రిటీలకు పబ్లిసిటీనే తెచ్చిపెడ్తుంది. ఆ మధ్య ఓ అందాల భామ 'బ్రెస్ట్‌' గురించిన వివాదం పెద్ద దుమారమే రేపింది. 'నేను మహిళని.. నేను బ్రెస్ట్‌ కలిగి వున్నాను.. ఇందులో తప్పేంటి..' అంటూ ఎక్స్‌పోజింగ్‌పై ఆ అందాల భామ చాలా ఘాటుగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. 

ఇక, తాజాగా మరో బాలీవుడ్‌ బ్యూటీ ఇలాంటి వివాదాన్నే మరింత రచ్చ చేసింది. ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద ప్రియాంకా చోప్రా ఫొటో ప్రచురితమైంది. ఆ ఫొటోకి 'రంధ్రాన్వేషణ' చేశారు కొందరు నెటిజన్లు. దాంతో ప్రియాంకా చోప్రాకి ఒళ్ళు మండిపోయింది. ఇదిగో, ఈ ఫొటోలోంచి రంధ్రాన్వేషణ చేయండంటూ ఇంకో ఫోటో ట్వీటేసింది. ఇంతకీ ఆ వివాదం దేనిగురించి అంటారా.? సిగ్గు సిగ్గు, 'ఆర్మ్‌ పిట్స్‌' గురించి. 

వాస్తవానికి ప్రియాంకా చోప్రా కూల్‌ అండ్‌ లవ్లీ బ్యూటీ. కానీ, ఆమెకు అంతలా ఒళ్ళు మండటానికి కారణం, 'అత్యుత్సాహంతో రంధ్రాన్వేషణ' చేసిన కొందరు నెటిజన్లే. సోషల్‌ మీడియా పుణ్యమా అని, అదో 'ఇడియట్‌ ప్లాట్‌ ఫామ్‌'గా తయారయ్యిందన్న విమర్శలున్నాయి. మత విధ్వేషాలు రగల్చడానికీ, ఇలాంటి జుగుప్సాకరమైన వివాదాలు తలెత్తడానికి సోషల్‌ మీడియా వేదికవుతోందిప్పుడు. అంతా చెత్తే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వుందని అనలేం. 

అన్నట్టు, ఇదివరకు ఇలాంటి గాసిప్స్‌, వివాదాలు తెరపైకి వస్తే, లైట్‌ తీసుకునేవారు సెలబ్రిటీలు. ఇప్పుడలా కాదు, పబ్లిసిటీ కోసమో.. ఖండించడానికి సరైన ప్లాట్‌ఫామ్‌ దొరికిందనో.. కారణమేదైతేనేం.. వివాదాల్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారంతే.

Show comments