సెప్టెంబర్ 2 న జనతా గ్యారేజ్?

ఆగస్టు 12 న విడుదల కావాల్సిన ఎన్టీఆర్-కొరటాల శివ జనతా గ్యారేజ్ విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. బహుశ సెప్టెంబర్ 2న విడుదల కావచ్చు అని తెలుస్తోంది.

సెప్టెంబర్ 2 శుక్రవారం, 3 శనివారం, 4 ఆదివారం, 5 వినాయక చవితి..అందువల్ల నాలుగు రోజుల వీకెండ్ కలిసి వస్తుంది. వాస్తవానికి ఆగస్టు 12న వచ్చినా నాలుగు రోజులు కలిసి వస్తాయి. ఎందుకంటే ఆగస్టు 15 సెలవు కాబట్టి.

ఇంతకీ వాయిదాకు కారణాలు పాటలు పూర్తి కాకపోవడమే అని తెలుస్తోంది. సినిమా టాకీ అంతా అయిపోయింది. ప్యాచ్ వర్క్ కూడా అయిపోయింది. కానీ రెండు పాటలు చెరో అయిదు రోజులు షూట్ చేయాల్సి వుంది. పైగా ఒక పాట కేరళలో అంటే అదో రెండు రోజుల అదనం. అంటే మొత్తం 12 రోజులు. ఈ లెక్కన చూసుకుంటే జూలై నెలాఖరు వచ్చేస్తుంది. అక్కడికి ఇక 12 రోజుల మిగుల్తుంది.

ఈ పన్నెండు రోజుల్లో మళ్లీ ఓవర్ సీస్ డిస్క్ లు ఇతరత్రా వ్యవహారాలు మరో నాలుగైదు రోజులు తీసేయాలి. అంటే కేవలం ఏడెనిమిది రోజులు మిగుల్తుంది. ఈ కొద్ది సమయంలోనే మిగిలిన డిటీఎస్, డిఐ, వగైరా జరగాలి. దీంతో హర్రీ హర్రీ అవుతుంది. అందుకే సినిమా వాయిదా పడక తప్పడం లేదు.

Show comments