స్పైడర్ పోస్ట్ ప్రొడక్షన్: గ్రాఫిక్స్ కోసం నయా ఫార్ములా

గ్రాఫిక్స్ లేట్ అవ్వడం వల్ల సినిమా వాయిదాపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇప్పటికే వాయిదాపడిన సినిమాకు గ్రాఫిక్స్ చేయాలంటే ఇంకెంత కష్టపడాలి.

ప్రస్తుతం అలాంటి కష్టాన్నే పడుతోంది స్పైడర్ టీం. విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఏకంగా 6 దేశాల్లో స్పైడర్ కు సంబంధించి గ్రాఫిక్స్ పనులు జరుపుతున్నారు.

"కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఇండియాతో పాటు రష్యా, ఇరాన్, బ్రిటన్ లాంటి పలు దేశాల్లో జరుగుతోంది. సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు, అనుకున్న టైమ్ కు సినిమాను కంప్లీట్ చేసేందుకు ఇలా చాలా దేశాల్లో సైమల్టేనియస్ గా సీజీ వర్క్ జరుపుతున్నాం." నిర్మాత ఠాగూర్ మధు స్టేట్ మెంట్ ఇది.

బాహుబలి-2 రిలీజ్ తర్వాత స్పైడర్ లో చాలా మార్పులొచ్చాయి. ఈ సినిమాకు కూడా అదిరిపోయే రేంజ్ లో గ్రాఫిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీని కోసం ప్రత్యేకంగా మహేష్ తో మరో షెడ్యూల్ షూట్ కూడా చేశాడు దర్శకుడు మురుగదాస్. ఇప్పుడు గ్రాఫిక్స్ పనుల్ని తనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

లెక్కప్రకారం దసరా బరిలో స్పైడర్ దిగాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 27కు స్పైడర్ రావాలి. కానీ ఆగస్ట్ చివరినాటికి గ్రాఫిక్స్ పూర్తవుతాయా అనేది డౌట్. ఇక షూటింగ్ విషయానికొస్తే 2పాటలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక సాంగ్ షూటింగ్ జరుగుతోంది. వచ్చేనెల మరో పాట షూటింగ్ ఉంటుంది.

Show comments