విడుదలకు ముందే.. వంద కోట్లా!

సూర్య ‘సింగం-3’ రెండు నెలల కిందట కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో విడుదల అవుతుందని అంటున్నారు. మరి ఇకనైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

ఇంతలా వాయిదా పడుతున్న ఈ సినిమా నిర్మాతల విషయంలో అంతా జాలి చూపుతుంటే.. ఈ సినిమా నిర్మాతలు మాత్రం భలే సంగతి చెబుతున్నారు. అదేమనగా.. తమ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వంద కోట్లను చేరిందని! తమిళ నాట తర్వాత రజనీ కాంత్ తర్వాత ఈ తరహా ఫీట్ సూర్యకే సాధ్యం అయ్యిందని వారు చెబుతున్నారు.

సినిమా ప్రదర్శన హక్కుల ధర, శాటిలైట్ రైట్స్ రూపంలో వంద కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని వారు చెబుతున్నారు!  ప్రస్తుతానికి ఎస్ – త్రీ సినిమాకు సంబంధించి ఈ విషయాన్నే ప్రచారం కోసం వాడుకుంటున్నారు. విడుదలకు ముందే వంద కోట్లు అంటున్నారు!  మరి ఈ కథ బాగానే ఉంది కానీ, సినిమా ఈ సారైనా కచ్చితంగా విడుదలై.. ఏ రేంజ్ వసూలు చేస్తుందనేది శేష ప్రశ్న! 

Show comments