తాప్సీ కూడా భయపెట్టేస్తుందా?

భలే మంచి రోజు అంటూ ఓ డిఫరెంట్ సినిమా తీసి, ఏవరేజ్ ఫలితం పొందారు ఎన్నారై నిర్మాతలు. ఇప్పుడు మళ్లీ మరో ప్రయత్నం చేస్తున్నారు. కొత్త డైరక్టర్ తో చేయబోయే ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్. సినిమా కూడా  హీరోయిన్ ఓరియెంటెడ్.

అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా కూడా హర్రర్ జోనర్ అని తెలుస్తోంది. నయనతార, త్రిష, అనుష్క, అంజలి, ఇలా చాలా మంది హర్రర్ సినిమాల్లో నటించేసారు. ఇప్పుడు ఇక తాప్సీ వంతు అన్నమాట.

జనవరిలో ప్రారంభమయ్యే ఈ సినిమాను మార్చినాటికి ఫినిష్ చేసి, సమ్మర్ లో పెద్ద సినిమాల మధ్య గ్యాప్ లో వదిలేయాలని షెడ్యూలు కూడా డిసైడ్ చేసుకున్నారట. సాహసం అంటూ ఓ థ్రిల్లర్ చేసిన తరువాత తాప్సీ మళ్లీ సరైన సినిమా చేయడం కుదరలేదు. ఈ సినిమాతో మరోసారి తన అభిమానులను అలరిస్తుందేమో?

Show comments