'పెటా' సంస్థ తరఫున ప్రచారం నిర్వహించే పేరుతో, అందాల భామలు విచ్చలవిడిగా అందాలు ఆరబోసేసి, పబ్లిసిటీ స్టంట్లు చేసేయడం కొత్తేమీ కాదు. అసలే పోర్న్‌స్టార్, ఆపై 'పెటా' ప్రచారకర్తగా మారిందంటే, ఇకపై ఆ అందాల భామ చేసే అందాల ఆరబోత ఏ స్థాయిలో వుంటుందో కదా.!
కాస్త వెరైటీగా, 'గో వెజిటేరియన్' అంటూ 'పెటా' కోసం సన్నీలియోన్ ఘాటు ఘాటుగా పోజు ఇచ్చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎర్రటి మిర్చి, ఆ పైన అర్ధనగ్నంగా సన్నీలియోన్.. పోజు మాత్రం ఓ రేంజ్‌లో అదిరిపోయింది. అయినా, 'గో వెజిటేరియన్' అని చెప్పడానికి, ఇంతలా అందాల ఆరబోసేయ్యడమేంటి.? అంటారా.! సన్నీలియోన్ గతంలో ఒలకబోసిన అందాల విందుతో పోల్చితే, ఇది చాలా చాలా చాలా తక్కువే. ఆ మాటకొస్తే, అసలు ఆమె రికార్డుల ప్రకారం చూస్తే, ఇది లెక్కల్లోని గ్లామర్ కానే కాదేమో.!
'స్పైస్ ఆప్ యువర్ లైఫ్.. గో వెజిటేరియన్' అంటూ ప్రస్తుతానికి ఫొటోలతో సరిపెట్టేసినా, ముందు ముందు 'పెటా' తరఫున మరింత ఘాటుగా.. అదేనండీ ఉధృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానంటోంది సన్నీలియోన్.