రెడ్డి గారూ.. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా..!

ప్రమాణాలు.. కూడా మొదలయ్యాయి. తమ పిల్లలను ఇంట్లో వాళ్లను కూడా రచ్చలోకి లాగుతున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. అధికార పార్టీలోకి నిస్సిగ్గుగా ఫిరాయిస్తున్న ఈ ఎమ్మెల్యేలు బుకాయింపు, దబాయింపులే కాదు ప్రమాణాలు, ఒట్లుతో సానుభూతిని కూడా పొందే యత్నం చేస్తున్నారు! తాజా ఫిరాయింపుదారు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తన పిల్లలపై కూడా ఒట్టు వేశాడు! తను డబ్బు తీసుకోలేదని.. చెప్పడానికి ఈయన ఈ ఒట్టు పెట్టుకున్నాడు!

అంతే కాదు.. మొన్న భూమా నాగిరెడ్డి వదిలిన డైలాగునే అమరనాథరెడ్డి కూడా వదిలాడు. తనకు రాజీనామా చేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని.. ఎటొచ్చీ జగన్ రాజకీయ జీవితాన్ని కాపాడటానికే తాను రాజీనామా చేయడం లేదనట్టుగా మాట్లాడాడు అమరనాథరెడ్డి. తను రాజీనామా చేసి గెలిస్తే జగన్ రాజీనామా చేసి వెళ్లిపోతాడా? అని అమరనాథరెడ్డి ఇప్పటికే భూమా అరగదీసిన డైలాగును వదిలాడు.

అయినా.. ఇక్కడ సమస్య ఫిరాయించినందుకు చేయాల్సిన రాజీనామా అయితే వీళ్లు మధ్య లో జగన్ రాజీనామా అంటారేంటి! రాజకీయ నేతలంటే ఎంత దారుణంగా అయినా మాట్లాడగలరు అనే విషయాన్ని రుజువు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు. అయినా ఇన్ని కబుర్లు ఎందుకు? పిల్లలు, పెళ్లాల మీద ఒట్లు ఎందుకు? హ్యాపీగా రాజీనామా చేసేసి.. ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము ఒక్కడైనా చూపడా!

ఈ ఒట్లు, ప్రమాణాలు పెట్టుకోవడం పెద్ద కథేం కాదు కదా! తెలుగులో ఏనాడో పెద్దలు సామెత చెప్పారు. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని! ఫిరాయించేసిన వాళ్లకు అబద్ధపు ప్రమాణాలు చేయడం పెద్ద లెక్కా? ఇలాంటి వంద చేయగలరు... రాజీనామా తప్ప!  Readmore!

Show comments

Related Stories :