జై లవకుశ టీజర్.. పాతదేనా? వేరే ఉందా?

ఎన్టీఆర్ ఫస్ట్ టైం త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ టీజర్ రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటల 22 నిమిషాలకు ముహూర్తం చూసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఎదురుచూస్తోంది కేవలం టీజర్ కోసం మాత్రమే కాదు. అందులో ఉండే కంటెంట్ కొత్తదా, పాతదా అనే విషయంపై క్లారిటీ కోసం కూడా ఎదురుచూస్తున్నారు.

అవును.. జై లవకుశ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్ లీక్ అయింది. లీక్ వీడియోలో క్వాలిటీ లేకపోయినా కంటెంట్ మాత్రం ఆడియన్స్ కు తెలిసిపోయింది. ఎక్కువమంది వీడియో చూస్తే, చాలామంది ఫొటోలు చూసేశారు.

సో.. జై లవకుశ టీజర్ చాలామందికి ఇప్పుడు పాత విషయం కిందే లెక్క. ఈ నేపథ్యంలో రేపు రిలీజ్ అవుతున్న టీజర్ లో కొత్త సన్నివేశాల్ని జోడించారా.. లేక ఇప్పటికే లీక్ అయిన కంటెంట్ నే అఫీషియల్ గా విడుదల చేస్తారా అనే విషయం తేలనుంది.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. జై టీజర్ తర్వాత.. లవకుమార్, కుశాల్ పాత్రలతో కూడా టీజర్లు విడుదల చేయాలనే ప్లాన్ లో ఉంది యూనిట్.

Show comments