చైతూతో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: సమంత

అక్టోబర్ 6న సమంత-నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు. గోవాలో 3రోజుల పాటు వీళ్ల వివాహం గ్రాండ్ గా జరగనుంది. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు త్వరలోనే మొదలుకాబోతున్నాయి.

పెళ్లికి సమంత ఎక్కడ షాపింగ్ చేస్తుంది.. పెళ్లికి ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుంది.. పెళ్లి తర్వాత హనీమూన్ ఎక్కడ లాంటి అంశాలపై ఆడియన్స్ ప్రస్తుతం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే నాగచైతన్యతో తనకు ఇప్పటికే పెళ్లయిపోయిందంటోంది సమంత.

కాస్త షాకింగ్ గా అనిపించినప్పటికీ సమంత చెప్పిన లాజిక్ వింటే మీరూ నిజమేనని ఒప్పుకుంటారు. "నేను ఆల్రెడీ చైతూను పెళ్లాడాను. నా మనసు అలానే చెబుతోంది. మేమిద్దరం ఇప్పటికే భార్యాభర్తలం. మా ఇద్దరి కంటే మిగతా వాళ్లే మా పెళ్లి గురించి ఎక్కువగా ఎక్సయిట్ అవుతున్నారు." ట్విట్టర్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత ఇచ్చిన సమాధానమిది.

ఇన్నాళ్లూ చైతన్యతో క్లోజ్ గా ఉండడం వల్ల పెళ్లి చేసుకుంటున్న ఫీలింగ్ తనకు లేదంటోంది సమంత. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని, ప్రత్యూష ఫౌండేషన్ వ్యవహారాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని అంటోంది సమంత.

Show comments