రాశి ఖన్నాకి బెస్ట్‌ కాంప్లిమెంట్‌

'హైపర్‌' సినిమా సక్సెస్‌తో మంచి జోరుమీదున్నానంటోంది రాశి ఖన్నా. రొటీన్‌ కమర్షియల్‌ మూవీ.. అనే టాక్‌ సంగతి పక్కన పెడితే, హీరోయిన్‌గా తన కెరీర్‌లో మరో హిట్‌ చేరిందనే ధీమా రాశి ఖన్నాలో కన్పిస్తోంది. రామ్‌తో రాశి ఖన్నాకి ఇది రెండో సినిమా. తొలి సినిమా 'శివమ్‌' నిరాశపర్చినా, ఫ్లాప్‌ కాంబినేషన్‌ అనే ఆందోళన ఏమాత్రం లేకుండా రామ్‌, 'హైపర్‌' సినిమా కోసం రాశి ఖన్నాకి ఛాన్సివ్వడం కాస్తంత ఆశ్చర్యకరమే. 

ఇంతకీ, రాశి ఖన్నాకి రామ్‌ 'హైపర్‌'లో ఎందుకు ఛాన్సిచ్చినట్లు.? అంటే, సినిమాలో తన తండ్రి పాత్రకు సత్యరాజ్‌ తప్ప ఇంకొకరు కష్టం అని ఎలాగైతే అనుకున్నామో, హీరోయిన్‌ పాత్రకి రాశి ఖన్నా తప్ప ఇంకెవరూ సూట్‌ అవరేమో అన్పించిందని రామ్‌ చెప్పుకొచ్చాడు. 'హైపర్‌'లో రాశి ఖన్నానే తీసుకోవడానికి మరో కారణం, కామెడీలో రాశి ఖన్నాకి వున్న టైమింగేనట. 

అవునా.? రాశి ఖన్నాకి కామెడీలో అంత మంచి టైమింగ్‌ వుందా.? అనడక్కండి. రామ్‌కి మాత్రం ఆమెలో కామెడీ టైమింగ్‌ బాగా నచ్చేసిందట. అద్గదీ అసలు విషయం. బహుశా రాశి ఖన్నాకి ఇంతకన్నా బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇంకోటుండదేమో.! అన్నట్టు, రాశి ఖన్నా 'హైపర్‌'లో పండించిన కామెడీ ఎలా వున్నా, ఒలక బోసిన గ్లామర్‌ గురించి మాత్రం టాలీవుడ్‌లోనే, కాదు ప్రేక్షకుల్లోనూ గట్టిగానే చర్చించేసుకుంటున్నారండోయ్‌.!

Show comments