శ్రీదేవి కూతురు దేశీ అవతార్!

ఇంతకు ముందు అరుదుగా మాత్రమే కెమెరామెన్ల కంట పడేది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. శ్రీదేవి తనయ ఫొటోలు ఏదో విధంగా వార్తల్లోకి వస్తున్నాయి. మొన్నమధ్య శ్రీదేవి దగ్గరుండి తనయ ఫొటో షూట్ చేయించింది. అలాగే డాన్సు, అభియనానికి సంబంధించిన విషయంలో కూడా శ్రీదేవి తన తనయకు ట్రైనింగ్ ఇప్పిస్తోందని సమాచారం.

ఆ సంగతలా ఉంటే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తరచూ పార్టీల్లోనూ, లంచ్ ల కు బయటికి వచ్చో అగుపిస్తోంది జాన్వీ. ఈ ఫొటో కూడా అలా వచ్చిందే. ఇందులో పూర్తిగా దేశీ అవతార్ లో కనిపించింది జాన్వీ. పక్కన ఉన్నది ఆమె స్నేహితుడట. అక్షత్ రాజన్ అతడి పేరు. ఇన్ స్టాగ్రమ్ లో ఈ ఫోటోను షేర్ చేశాడతను. 

Readmore!
Show comments

Related Stories :